SreeLeela: వ్యూస్, లైక్స్ కోసం ఇంకొకరిని న్యూస్ చేయకండి.. హీరోయిన్ శ్రీలీల ఆసక్తికర వీడియో

SreeLeela: వ్యూస్, లైక్స్ కోసం ఇంకొకరిని న్యూస్ చేయకండి.. హీరోయిన్ శ్రీలీల ఆసక్తికర వీడియో

వ్యూస్ కోసం ఇంకొకరిని న్యూస్ చేయకండి అంటోంది లేటెస్ట్ సెన్సేషన్ బ్యూటీ శ్రీలీల(Sreeleela). వ్యూస్,లైక్స్ కోసం సోషల్ మీడియాను వాడుకుంటున్న నెటిజన్లకి తనదైన శైలిలో స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. వివరాల్లోకి వెళితే.. 

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో వస్తోన్న ఫేక్ న్యూస్, ఫోటోల మార్పిడి, డీప్ ఫేక్ వీడియోలు ఇలా ప్రతిదీ ఎంతోమందిని ఇబ్బందికి గురిచేస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్న చేసే వారు మాత్రం ఆగట్లేదు.

ఇలాంటి వాటికీ బలవకుండా ప్రజల్లో ఎన్నో అవగాహనా కార్యక్రమాలు ప్రభుత్వాలు చేపడుతున్నాయి. అయినప్పటికీ ఇవి రిపీట్ అవుతూనే ఉన్నాయి. దాంతో సమాజ శ్రేయస్సు కోసం ప్రతిఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ, క్రీడా స్టార్స్ తమదైన శైలిలో స్పందిస్తూ వస్తున్నారు. లేటెస్ట్గా ఏపీ డిజిటల్‌ కార్పోరేషన్‌తో కలిసి హీరోయిన్ శ్రీలీల ఓ వీడియో ద్వారా సందేశాన్ని ఇచ్చింది.

Also Read : విషమంగానే శ్రీతేజ్‌ పరిస్థితి.. రెండు రోజుల నుంచి మళ్లీ వెంటిలేటర్ పైనే 

‘సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్, రీచ్ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి. సోషల్ మీడియాను మన మంచి కోసం వాడుదాం. వ్యూస్ కోసం ఇంకొకరిని న్యూస్ చేయకండి. అసత్య ప్రచారాలకు దూరంగా ఉందాం. సామాజిక బాధ్యత వహిద్దాం.. అంటూ శ్రీలీల వీడియో ద్వారా తెలిపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రస్తుతం టాలీవుడ్ మొత్తాన్ని తన వెంట తిప్పికుంటోంది లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల. చిన్న హీరో అయినా, స్టార్ హీరో అయినా..హీరోయిన్ మాత్రం శ్రీలీలనే. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో దాదాపు తొమ్మిది సినిమాలున్నాయి.ఇందులో నితిన్, నవీన్ పోలిశెట్టి,రవితేజ, అఖిల్, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్తో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.