తాప్సీ రహస్య వివాహం..? సడెన్ గా ఎందుకిలా..

హీరోయిన్ తాప్సీ వివాహం ఈనెల 23న ఉదయ్‌‌పూర్‌‌‌‌లో రహస్యంగా జరిగినట్టు తెలుస్తోంది. బ్యాడ్మింటన్ ప్లేయర్ ‘మథియస్‌‌ బో’ను ఆమె పెళ్లాడింది. గత పదేళ్లుగా వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబ సభ్యులతో పాటు కనిక థిల్లాన్, అనురాగ్ కశ్యప్, పవైల్ గులాటి లాంటి అతి కొద్దిమంది సెలబ్రిటీలు ఈ పెళ్లికి హాజరైనట్టు సమాచారం.

తాప్సీ ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, తన ఫ్రెండ్, నిర్మాత కనిక కొన్ని ఫొటోస్‌‌ షేర్ చేశారు. వాటికి ‘నా స్నేహితుల పెళ్లిలో’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈ పెళ్లి వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక ఇటీవల పెళ్లి వార్తలపై తాప్సీ స్పందిస్తూ.. పర్సనల్‌‌ లైఫ్‌‌లో ఏం జరుగుతుందో చెప్పమని ఎవరినీ ఒత్తిడి చేయకూడదని, పెళ్లి అనేది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని, ఒకవేళ దేని గురించైనా ప్రకటన చేయాలనుకుంటే స్వయంగా వెల్లడిస్తానని చెప్పింది.