బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ తమన్న

బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ తమన్న

మహదేవ్ ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ అప్లికేషన్ సపోర్టింగ్ యాప్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను చట్టవిరుద్ధంగా వీక్షించడాన్ని ప్రోత్సహించినట్లు బాలీవుడ్ హీరోయిన్ తమన్నపై ఆరోపణలు ఉన్నాయి. మహాదేవ్ బెట్టింగ్ యాప్ మనీలాండరింగ్‌ కేసులో నటి తమన్నా భాటియాను అక్టోబర్ 17న ప్రశ్నించినట్లు ఈడీ అధికార వర్గాలు తెలిపాయి. యాప్‌ ద్వారా బిట్‌కాయిన్‌, క్రిప్టోకరెన్సీలను మైనింగ్‌ సాకుతో చాలామంది ఇన్వెస్టర్లను మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇందులో తమన్నా భాటియాపై ఎలాంటి నేరారోపణలు లేవు. కానీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గౌహతి కార్యాలయంలో విచారించింది. 

ALSO READ | ఒక్క ఫ్రై డే సినిమా హీరోల లైఫ్ మార్చేస్తుంది: కిరణ్ అబ్బవరం

అంతకు ముందు ఈడీ కార్యాలయానికి తమన్నా తల్లితో కలిసి చేరుకుంది. ప్రస్తుతం ఆమె నుంచి వాంగ్మూలం తీసుకున్నట్లు సమాచారం. కేవలం తమన్న యాప్‌ని ప్రమోట్‌ మాత్రమే చేశారని.. అందుకు కొంత డబ్బు తీసుకున్నారని, ఆమెపై ఎలాంటి నేరారోపణలు లేవని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి.

తమన్న టి ఫెయిర్‌ప్లే బెట్టింగ్ యాప్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లను చూడడాన్ని ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో ఆమెను ఈరోజు మధ్యాహ్నం నుంచి దాదాపు ఐదు గంటలపాటు ఈడీ విచారించింది. అంతేకాదు ఇటీవల 'స్త్రీ 2' చిత్రంతో తమన్నా వార్తల్లో నిలిచింది. అందులో ఆమె 'ఆజ్ కీ రాత్' పాటతో ఫుల్ ఫేమస్ అయ్యింది.