ఇళయదళపతి విజయ్(Thalapathy Vijay) తో త్రిష (Trisha) నటించిన ‘లియో(Leo)’ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఖైదీతో హిట్టుకొట్టిన లోకేశ్ కనగరాజ్దీనికి దర్శకుడు కావడంతో ఎక్కడ లేని హైప్ క్రియేట్ అవుతోంది. ఇందులో త్రిష రోల్ ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది. కానీ, ప్రమోషనల్ పోస్టర్స్‌లో త్రిష లుక్స్ ఆకట్టుకుంటున్నాయి.
ఇంతకు ముందెన్నడూ లేనంత అందంగా కనిపిస్తూ ఫ్యాన్స్‌ను మంత్రముగ్ధులను చేస్తోంది ఈ సొట్టబుగ్గల సుందరి. అయితే, విజయ్‌తో త్రిషకు ఇది ఐదో సినిమా. చివరి సారిగా వీరిద్దరూ కలిసి ‘కురువి’ అనే సినిమాలో నటించారు. మళ్లీ 15 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ జోడీని తెరపై చూసేందుకు ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు.
Also Read : నాకు ఆత్మహత్యే శరణ్యం: నటి పావలా శ్యామల
సినిమాలో వీరిద్దరి మధ్య సీన్స్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. దీంతో వీరి కాంబో మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ నెల 19న లియో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
ప్రసెంట్ త్రిష వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం యంగ్ హీరోలతో పాటు..సీనియర్ హీరోలతోను యాక్ట్ చేస్తుంది. ప్రస్తుతం త్రిష చేతిలో అరడజనుకి పైగా మూవీస్ ఉన్నట్లు తెలుస్తోంది. త్రిష సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 25 ఏళ్లు దాటినా ఆమె క్రేజ్ మాత్రం అస్సలు తగ్గటం లేదు. వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ ప్రెజెంట్ హీరోయిన్స్ కు టఫ్ ఫైట్ ఇస్తోంది. అంతేకాదు రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకుంటోంది.
స్టార్ డైరెక్టర్ మణిరత్నం, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబోలో ఒక భారీ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. KH234 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం స్టార్ క్యాస్ట్ ను సెట్ చేస్తున్నారు దర్శకుడు మణిరత్నం. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టు లోకి త్రిషను తీసుకున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
అంతేకాదు ఈ సినిమా కోసం త్రిషకు రూ.12 కోట్ల భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిల్మ్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్త గనుక నిజమైతే.. సీనియర్ హీరోయిన్స్ లో ఈ రేంజ్ రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ గ త్రిష రికార్డ్ క్రియేట్ చేస్తుంది.