నలభై ఏళ్ల వయసులో త్రిష వరుస సినిమాలు.. సక్సెస్​ సీక్రెట్​ అదేనట

సౌత్లో సీనియర్​బ్యూటీల హవా తగ్గుతున్న వేళ త్రిష (Trisha) మాత్రం తన దూకుడు చూపిస్తోంది. కుర్ర హీరోయన్లకు సైతం పోటినిచ్చేలా తనను తాను మలుచుకుని బడా ఆఫర్లు కొట్టేస్తోంది. ఇటీవల విజయ్​తో కలిసి ఆమె నటించిన ‘లియో’ సినిమా బ్లాక్​బస్టర్​ టాక్​ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ జోడీ తెరపై కనిపించడంతో ఫ్యాన్స్​ పండగ చేసుకుంటున్నారు.

అయితే, ఇన్నేళ్లైనా త్రిష హీరోయిన్ల రేసులో వెనకబడకపోవడానికి గల కారణాలను తాజాగా చెప్పింది. యాక్టర్స్​అంటేనే కేరీర్లో అప్​అండ్​డౌన్స్​కచ్చితంగా ఉంటాయి. వాటన్నింటినీ సమానంగా తీసుకుని ముందుకెళ్లాలి. నేను దీనిని ఫాలో అవ్వడం వల్లే ఈరోజు నా స్థానాన్ని నిలబెట్టుకోగలిగాను అంటూ చెప్పుకొచ్చిందీ చెన్నై బ్యూటీ. 

ALSO READ :- ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాల్లోనూ బీఆర్ఎస్దే విజయం

స్టార్ హీరో అజిత్ లేటెస్ట్ మూవీ విదా మూయుర్చిలో నటిస్తుంది. అలాగే కమల్..మణిరత్నం కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంతో పాటు.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ రామ్ మూవీలో కూడా నటిస్తుంది. ఇక త్రిష ది రోడ్‌  మూవీలో కనిపిస్తుంది, ఇది రివెంజ్ డ్రామా అక్టోబర్ 6, 2023న విడుదల కానుంది. వీటితో పాటు మరికొన్ని కొత్త ప్రాజెక్ట్స్కు త్రిష ఆల్రెడీ సైన్ చేసినట్లు తెలుస్తోంది.   

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trish (@trishakrishnan)