బేబీకి భలే చాన్సెస్.. వైష్ణవి చైతన్య చేతిలో ప్రెజెంట్ ఎన్ని సినిమాలున్నాయంటే..

బేబీకి భలే చాన్సెస్.. వైష్ణవి చైతన్య చేతిలో ప్రెజెంట్ ఎన్ని సినిమాలున్నాయంటే..

‘బేబీ’ చిత్రంతో పాపులారిటీ తెచ్చుకుంది  అచ్చ తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య. తెలుగమ్మాయిలకు అవకాశాలు రావని కొందరు అంటుంటే.. ఈమె మాత్రం టాలెంట్ ఉంటే అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయని ప్రూవ్ చేస్తోంది. షార్ట్ ఫిల్మ్స్‌‌‌‌‌‌‌‌తో మొదలుపెట్టిన కెరీర్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది.  కథాబలంతో పాటు  ఇంపార్టెన్స్ ఉండే పాత్రలనే ఎంచుకుంటోంది వైష్ణవి చైతన్య.

తెలుగుతో పాటు  తమిళ, కన్నడలోనూ వరుస చాన్సెస్ దక్కించుకుంటుంది. తెలుగులో  ఆమె నటించిన ‘జాక్’ చిత్రం ఏప్రిల్ 10న విడుదలవుతోంది. ఇందులో వైష్ణవి డ్యూయెల్‌‌‌‌‌‌‌‌  రోల్‌‌‌‌‌‌‌‌లో అలరించనుంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ రూపొందించిన ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డకు తను జోడీగా నటించింది.   దీంతో పాటు ‘90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’  వెబ్ సిరీస్ కి సీక్వెల్‌‌‌‌‌‌‌‌గా రూపొందుతోన్న సినిమాలో కూడా ఆనంద దేవరకొండ సరసన హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటించనుంది వైష్ణవి. 

సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే  సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌‌‌‌‌‌‌‌గా ఉండే  ఈమె.. తనకు సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ట్రెడిషినల్ వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అందర్నీ ఇంప్రెస్ చేస్తోంది.  వైష్ణవి పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి.