
తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రికి భారీ విరాళమందింది. ఆలయ స్వర్ణతాపడం కోసం రూ. 2.5 కోట్లు ఇస్తున్నట్లు హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ బండి పార్థసారథి రెడ్డి తెలిపారు. కంపెనీ తరపున రూ. 2 కోట్లు, తన ఫ్యామిలీ తరపున మరో రూ. 50 లక్షలు మొత్తం కలిపి రూ. 2.5 కోట్లు యాదాద్రి దేవాలయానికి అందజేయనున్నట్లు ఆయన చెప్పారు.
For More News..