5 శాతం ప్రీమియంతో లిస్టయిన హెక్సావేర్​ షేర్లు​

5 శాతం ప్రీమియంతో లిస్టయిన హెక్సావేర్​ షేర్లు​

న్యూఢిల్లీ :  హెక్సావేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ షేర్లు బుధవారం ఇష్యూ ధర రూ.708 కంటే ఐదు శాతం ఎక్కువ ప్రీమియంతో లిస్టింగ్ అయ్యాయి. ఈ షేరు బీఎస్‌ఈలో ఇష్యూ ధర కంటే 3.24 శాతం ప్రీమియంతో రూ.731 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. తరువాత 10.16 శాతం పెరిగి రూ.780కి చేరుకుంది. ఎన్‌ఎస్‌ఇలో, ఇది రూ.745.50 వద్ద లిస్టింగ్ అయి 5.29 శాతం ర్యాలీ చేసింది.

కంపెనీ మార్కెట్ విలువ రూ.46,127.06 కోట్లుగా ఉంది. హెక్సావేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఐపీఓ శుక్రవారం బిడ్డింగ్ చివరి రోజున పూర్తిగా సబ్‌స్క్రయిబ్​అయింది. ఇన్​స్టిట్యూషనల్​ఇన్వెస్టర్ల మద్దతుతో 2.66 రెట్లు సబ్‌స్క్రిప్షన్​వచ్చింది. ఇష్యూ సైజు రూ.8,750 కోట్లు కాగా, ప్రైస్​బ్యాండ్​ను రూ.674–-708 మధ్య నిర్ణయించారు. మొత్తం ఇష్యూ ఓఎఫ్​ఎస్​ కాబట్టి ఐపీఓ నుంచి  కంపెనీ ఆదాయం రాదు.

షేర్​హోల్డర్లకు వెళ్తుంది.  ఇదిలా ఉంటే బుధవారం బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్,  నిఫ్టీ స్వల్ప నష్టాలతో ముగిశాయి.  సెన్సెక్స్ 28.21 పాయింట్లు తగ్గి 75,939.18 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 12.40 పాయింట్లు క్షీణించి 22,932.90 వద్ద ముగిసింది.