
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కంపెనీ తన కొత్త లోగోను విడుదల చేసింది. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో కలర్‌ఫుల్ లోగోను రిలీజ్ చేసింది. ఫేస్‌బుక్ అని ఇంగ్లీష్ పెద్దక్షరాల్లో రాసి కొత్త ఫాంట్‌లోకి మార్చి లోగోను తీసుకొచ్చింది. నీలం, ఆకుపచ్చ, ఎరుపు, పర్పుల్, ఆరెంజ్ రంగులతో లోగోను రెడీ చేసింది. తమ కంపెనీకి అనుబంధంగా ఉన్న వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా యాప్‌లతో సరిపోయేలా లోగోను డిజైన్ చేసింది. లోగో రంగుల్లో బ్లూ కలర్ ఫేస్‌బుక్, గ్రీన్ కలర్ వాట్సాప్.. పర్పుల్, రెడ్, ఆరెంజ్ ఇన్‌స్టాగ్రామ్‌ను తెలియజేస్తాయి. ప్రస్తుతం ఫేస్‌బుక్‌కు ఫేస్‌బుక్ యాప్, మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, వర్క్ ప్లేస్, ఓకులస్, పోర్టల్, కాలిబ్రా లాంటి అనుబంధ యాప్స్ ఉన్నాయి. తమ కంపెనీ అన్ని ప్రొడక్టులు, యాప్‌లపై ‘ఫ్రమ్ ఫేస్‌బుక్’ అంటూ ఈ ఏడాది జూన్ నుంచి యాడ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రమ్ ఫేస్‌బుక్ అని పింక్ కలర్‌లో, వాట్సాప్‌లో గ్రీన్ కలర్‌లో ఉంటుంది. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లు ఫేస్‌బుక్‌వని 29 శాతం మంది అమెరికన్లు మాత్రమే గుర్తించినట్టు ఇటీవల ప్యూ రీసెర్చ్ సంస్థ అక్కడ చేసిన సర్వేలో వెల్లడైంది. దీంతో తాము రెడీ చేసే ప్రొడక్ట్‌ల గురించి జనాలకు తెలియజేసేందుకు కొత్త లోగో తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో ఫేస్‌బుక్ కొత్త వెబ్‌సైట్‌నూ అందుబాటులోకి తేనున్నట్టు సమాచారం.