అప్పుడో ఇప్పుడో ఎప్పుడో నుంచి "హే తార" లిరికల్ సాంగ్ రిలీజ్..

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో నుంచి "హే తార"  లిరికల్ సాంగ్ రిలీజ్..

టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రముఖ డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న"అప్పుడో ఇప్పుడో ఎప్పుడో" చిత్రహంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరో నిఖిల్ కార్ రేసర్ గా నటిస్తున్నాడు. నిఖిల్ కి జంటగా కన్నడ బ్యూటీఫుల్ హీరోయిన్ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా అజయ్, దివ్యాంశ కౌశిక్, హర్ష చందు, జాన్ విజయ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తీ చేసుకుని రిలీజ్ కి సిద్దంగా ఉంది. 

ఇటీవలే చిత్ర యూనిట్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో నుంచి "హే తార"  లిరికల్ సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఈ పాటని ప్రముఖ లిరిక్ రైటర్ కృష్ణ చైతన్య రాయగా కార్తీక్, నిత్యశ్రీ తదితర సింగర్స్ పాడారు. ఇక పాటని మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ కంపోజ్ చేశారు. కూల్ మెలోడీ తరహాలో సాగుతూ క్లాస్ లిరిక్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది హే తార లిరికల్ సాంగ్.

అయితే ఈ చిత్రాన్ని నవంబర్ 8న రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్ ప్రకటించారు. కానీ ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన పలు పోస్ట్ ప్రొడక్షన్ మరియు ఎడిటింగ్ పనులు పూర్తీ కానందున అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. దీనికితోడు హీరో నిఖిల్ కూడా ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ప్రమోషన్స్ కి హాజరవ్యవడం లేదని టాక్. దీంతో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రం రిలీజ్ పై చిత్ర యూనిట్ మరోసారి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

ALSO READ | పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ తో వస్తున్న యాంకర్ ప్రదీప్... హిట్ కొడతాడా..?

ఈ విషయం ఇలా ఉండగా  అక్టోబర్ 11న అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా టీజర్ నిరిలీజ్ చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ లో బ్యాక్ డ్రాప్ లో కట్ చేసిన ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. టీజర్ తో అలరించిన నిఖిల్ థియేటర్లలో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.