ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం (సెప్టెంబర్ 19) ఇజ్రాయెల్ తమ ప్రాంతాలపై రాకెట్ లాంఛర్లతో భీకర దాడులు చేయడంతో.. తాజాగా హిజ్బొల్లా ప్రతీకారదాడులకు దిగింది. ఇవాళ (సెప్టెంబర్ 20) దాదాపు 140 రాకెట్ లాంఛర్లతో ఉత్తర ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా ఎటాక్ చేసింది. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) హిజ్బొల్లా దాడులను తిప్పికొట్టింది. ఇజ్రాయెల్, హిజ్బొల్లా పరస్పర దాడులతో లెబనాన్, ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి
ALSO READ | అమ్మో.. ఇంత పెద్ద కుట్రనా.. పేలుళ్లకు పేజర్లనే వాడటానికి కారణం ఇదా..!
ఇజ్రాయెల్, హిజ్బొల్లా మధ్య దాదాపు సంవత్సరం నుండి యుద్ధం నడుస్తున్నప్పటికీ.. తాజాగా జరిగిన దాడులే అతిపెద్దవని హిజ్బొల్లా నేత ఒకరు మీడియాకు వెల్లడించారు. కాగా, కమ్యూనేషన్ కోసం హిజ్బొల్లా నేతలు ఉపయోగిస్తోన్న ఎలక్ట్రానిక్ పరికరాలు పేజర్లు, వాకీ టాకీలు పేలడం ఈ రెండు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతకు దారి తీసింది. మంగళవారం (సెప్టెంబర్ 17 ) పేజర్లు, వాకీ టాకీలు పేలి వందల సంఖ్యలో హిజ్బొల్లా సభ్యులు గాయపడ్డారు.
ఇది ఇజ్రాయెల్ పనేనని అనుమానం వ్యక్తం చేసిన హిజ్బొల్లా.. కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. హెజ్బొల్లా వార్నింగ్‌పై కన్నెరజేసిన ఇజ్రాయెల్ దళాలు.. గురువారం వందల కొద్ది రాకెట్ లాంఛర్లతో లెబనాన్‌లోని హిజ్బొల్లా స్థావరాలపై విరుచుకుపడ్డాయి. దీనికి ప్రతిదాడిగా ఇవాళ హిజ్బొల్లా ఇజ్రాయెల్‌పై రివర్స్ ఎటాక్ చేసింది. ఇజ్రాయెల్, హిజ్బొల్లా మధ్య యుద్ధ వాతావరణ నెలకొనడంతో పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.