ఇజ్రాయిల్‌పై హిజ్బుల్లా కౌంటర్ అటాక్ : బీట్ హిల్లెల్ పై రాకెట్ల వర్షం

ఇజ్రాయిల్‌పై హిజ్బుల్లా  కౌంటర్ అటాక్ : బీట్ హిల్లెల్ పై  రాకెట్ల వర్షం

ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధవాతావరణం ముదురుతుంది. ఉత్తర ఇజ్రాయెల్ లోని బీట్ హిల్లెల్ నగరంపై ఆదివారం హిజ్బుల్లా కత్యుషా రాకెట్ల వర్షం కురిపించింది. రెండు రోజులుగా ఇరాన్ మద్దతుదారులైన హిజ్బుల్లా కమాండర్‌, హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియే లను ఇజ్రాయిల్ దాడులు చేసి హతమార్చింది. దానికి ప్రతీకార చర్యగా ఆగస్ట్ 4న లెబనాన్‌లోని మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా రాకెట్లతో ఇజ్రాయిల్ దేశంపై దాడి చేసింది.

బీట్ హిల్లెల్ నగరంపై రాకెట్ దాడి లెబనీస్ నగరాలైనటువంటి క్చర్ కేలా, డీర్ సిరియాపై ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకార చర్య. పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య లెబనాన్‌ను విడిచిపెట్టాలని అమెరికా, ఇంగ్లాండ్ దేశాలు తమ పౌరులను కోరాయి. హిజ్బుల్లా ప్రయోగించిన కొన్ని రాకెట్లలో ఐదు మినహా మిగిలినవి గాలిలో ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) పశ్చిమ గెలీలీలో దాడికి ఉపయోగించిన లాంచర్‌ను నాశనం చేసింది.