ఇజ్రాయిల్‌పై రాకెట్ దాడి.. ఫుట్‌బాల్ కోర్ట్‪లో 12 మంది పిల్లలు మృతి

ఇజ్రాయిల్‌పై రాకెట్ దాడి.. ఫుట్‌బాల్ కోర్ట్‪లో 12 మంది పిల్లలు మృతి

ఇజ్రాయిల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌లోని ఫుట్‌బాల్ గ్రౌండ్‍లో శనివారం రాకెట్ అటాక్ జరిగింది. ఈ దాడి హిజ్బుల్లాయే చేసిందని ఇజ్రాయిల్ సైన్యాధికారులు ఆరోపిస్తున్నారు. ఫుట్ బాల్ కోర్టులో ఉన్న 12 మంది పిల్లలు మృతిచెందారు. మరికొంత మంది గాయపడ్డారు. ఈ దాడికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు() హెజ్బుల్లాను హెచ్చరించారు.

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో ఈ బాధాకరమైన దాడిపై ఇజ్రాయెల్ మౌనంగా ఉండదని, దీనికి హిజ్బుల్లా భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుందన్నారు. బెంజమిన్ నెతన్యాహు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. కానీ గోలన్ హైట్స్‌పై దాడి తర్వాత, ఆయన పర్యటనను మధ్యలోనే వదిలి ఇజ్రాయెల్‌కు తిరిగి వస్తున్నారు. మరోవైపు ఈ దాడి ఘటనను హిజ్బుల్లా ఖండించింది.