హైదరాబాద్​లో హైలైఫ్ ఎగ్జిబిషన్​ షురూ

హైదరాబాద్​లో హైలైఫ్ ఎగ్జిబిషన్​ షురూ

హైదరాబాద్​, వెలుగు : హైలైఫ్​ పేరుతో ఫ్యాషన్​, లైఫ్​స్టైల్​ ఎగ్జిబిషన్ ​శుక్రవారం హైదరాబాద్​లో మొదలైంది. ఇది ఈ నెల పదో తేదీ వరకు ఉంటుంది. ఫ్యాషన్​, గ్లామర్, స్టైల్, లగ్జరీ ప్రొడక్టులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఫెస్టివల్​, లైఫ్​స్టైల్​, వెడ్డింగ్​షాపింగ్​కు ఇది అనువైన ఎగ్జిబిషన్​ అని నిర్వాహకులు తెలిపారు. 

నగలనూ కొనుక్కోవచ్చని ఎగ్జిబిషన్​ సీఈఓ అబీ డోమినిక్​ చెప్పారు. ఫ్యాషన్, జ్యూయలరీ రంగంలోని టాప్​కంపెనీలు, డిజైనర్లు పాల్గొంటున్నారని చెప్పారు.