జీఎచ్ఎంసీ కౌన్సిల్ దగ్గర భారీ బందోబస్తు.. బడ్జెట్కు ముందు హైటెన్షన్

జీఎచ్ఎంసీ కౌన్సిల్ దగ్గర భారీ బందోబస్తు.. బడ్జెట్కు ముందు హైటెన్షన్

జీఎచ్ఎంసీ కౌన్సిల్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. జీఎచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ గురువారం (30 జనవరి, 2025) జరుగుతుండటంతో కౌన్సిల్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. 2025 -26 ఆర్ధిక సంవత్సరానికి రూ.8,440 కోట్ల బల్దియా బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు మేయర్. ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీల సభ్యులు తమ వ్యూహాలతో సిద్ధమయ్యారు. ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకుంటుండటంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

కౌన్సిల్ మీటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. అధికారులు మీటింగ్ హాల్ వద్ద మార్షల్స్ ను ఏర్పాటు చేశారు. కౌన్సిల్ లో గందరగోళం నెలకొంటే.. కారకులైన వ్యక్తులకు బయటకు పంపుతామని హెచ్చరించారు.

Also Read : బిజినెస్ మేనేజ్​మెంట్ కోర్సులదే 

కౌన్సిల్ మీటింగ్ కోసం బీజేపీ కార్పోరేటర్లు భిక్షాటనతో వచ్చారు. తమ డివిజన్ కి నిధులు ఇవ్వండి సారు అంటూ అడుక్కుంటున్నట్లు కనిపించారు. ట్యాక్సులు కడుతున్నా తమ డివిజన్ కి నిధులు కేటాయించట్లేదంటూ భిక్షాటన చేపట్టారు. 

మేయర్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న సందర్భంగా కాంగ్రెస్ కార్పోరేటర్లు మంత్రి పొన్నంతో భేటీ అయ్యారు. ఆ తర్వాత మినిస్టర్ క్వార్టర్ నుంచి జీహెచ్ఎంసీ యాక్ట్ బుక్ తో కార్యాలయానికి మేయర్, డిప్యూటీ మేయర్, కార్పోరేటర్లు చేరుకున్నారు. జీహెచ్ఎంసీ యాక్ట్ గురించి బీఆర్ఎస్ కార్పొరేటర్లు తెలుసుకోవాలంటూ కాంగ్రెస్ కార్పోరేటర్లు నినాదాలు చేశారు. చట్టం గురించి తెలియకుండా అవిశ్వాస తీర్మానం అంటూ బీఆర్ఎస్ కార్పోరేటర్లు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారన్నారని ఆరోపించారు.