![వ్యాపారవేత్తలకు, కంపెనీలకు హైబిజ్ ఎక్స్లెన్స్అవార్డులు](https://static.v6velugu.com/uploads/2025/02/hibiz-excellence-awards-for-entrepreneurs-companies_N7eAlhSdXo.jpg)
- అందజేసిన మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు: హైబిజ్ టీవీ బిజినెస్ ఎక్స్ లెన్స్ అవార్డులను రాష్ట్రమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అందజేశారు. వివిధ రకాల వ్యాపారాల్లో రాణిస్తున్న సంస్థల కు, వ్యక్తులకు హై బిజ్ టీవీ బిజినెస్ ఎక్స్ లెన్స్ అవార్డులు దక్కాయి. 60కి పైగా పురస్కారాలు ఇందులో ఉన్నాయి.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాణిజ్యం, వ్యాపారం లేకుండా ప్రభుత్వాలు, వ్యవస్థలు నడవలేవని చెప్పారు. కీలక రంగాల్లో అమూల్యమైన సేవలు అందించిన వారిని హై బిజ్ టీవీ గుర్తించి అవార్డులు ఇవ్వడం గొప్ప విషయమని కొనియాడారు.
ఇదొక మంచి ప్రయత్నంగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ఏడాది కాలంలో తమ ప్రభుత్వం.. వ్యాపార రంగాభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించిందని శ్రీధర్ బాబు చెప్పారు.
2023లో తెలంగాణ అభివృద్ధి రెండు రెట్లు ఉందని, రాబోయే నాలుగేళ్లలో దానిని పదిరెట్లకు పెంచుతామని అన్నారు. మన రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తు తున్నాయని, దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో రూ.1.7 లక్షల కోట్ల ఇన్వెస్ట్ మెంట్స్ సాధించామని చెప్పారు.