లాడ్జి బల్బుల్లో రహస్య కెమెరాలు.. దంపతుల వీడియోల రికార్డు

లాడ్జి బల్బుల్లో రహస్య కెమెరాలు.. దంపతుల వీడియోల రికార్డు
  • తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బుల వసూలు
  • శంషాబాద్ సీతా గ్రాండ్ హోటల్ యజమాని అరెస్టు 

శంషాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టు రహదారిలో ఉన్న సీతా గ్రాండ్ హోటల్ లాడ్జిలో రహస్యంగా సీసీ కెమెరాలు అమర్చి అక్కడికి వచ్చే మహిళలు, దంపతుల వీడియోలు తీస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్న హోటల్ యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ ఇన్ స్పెక్టర్ బాలరాజు  తెలిపిన వివరాల ప్రకారం..  సీతా గ్రాండ్ హోటల్ పేరుతో పోతూరి గణేశ్ (24) అనే నిర్వాహకుడు హోటల్ రూం లైట్స్ లో హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేశాడు.

హోటల్ కు వచ్చే దంపతులు, మహిళల ప్రైవేటు వీడియోలు తీసి వారికి పంపించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నాడు.  ఓ జంట ఆదివారం పోలీసులకు కంప్లైంట్ చేయగా.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఫిర్యాదు రాగానే పోలీసులు రంగప్రవేశం చేసి హోటళ్లో రహస్యంగా అమర్చిన హిడెన్ కెమెరాలను తొలగించి నిందితుడిని అదుపులోకి  తీసుకుని రిమాండ్ కు తరలించారు. అనంతరం హోటల్ మూసేశారు. ఇప్పటి వరకు ఇలా ఎంతమంది వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.