జనగామ జిల్లాలో గుప్తా నిధుల కోసం తవ్వకాలు జరపడం కలకలం రేపుతోంది. జనగామ మండలంలోని పెద్దపహాడ్ గ్రామంలో గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు.. కాటబోయిన రాములు,దండు సిద్ధులుకు చెందిన భూమిలో తవ్వకాలు జరిపారు. గ్రామస్తులను చూసి పరారయ్యారు.
గుంతను తవ్వి పసుపు, కుంకుమ నిమ్మకాయలతో పాటు గొర్రెను బలిచ్చిన ఆనవాళ్లు ఉన్నాయి. గ్రామస్థుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో భయాందోళనకు గురవుతున్నారు గ్రామస్తులు.