కన్నీళ్లు పెట్టుకున్న అశ్విన్.. ఎమోషనల్ ఐన ఓంకార్.. ఇది బ్రదర్స్ బాండింగ్ అంటే

టాలీవుడ్ హీరో అశ్విన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన అన్న ఓంకార్ ను తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. అశ్విన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ హిడింబ. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా సినిమా నుండి రిలీజైన ట్రైలర్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. 

ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ఓంకార్ హోస్ట్ చేస్తున్న సిక్త్ సెన్స్ షో ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ షోలో పాల్గొన్న తన తమ్ముడిని చూసి ఓంకార్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇందులో భాగంగా ఓంకార్ తన తమ్ముడిని..  నీ జీవితంలో ఎప్పుడైనా బాధపడిన సందర్భం ఉందా అని అడిగాడు.

 ఈ ప్రశ్నకు బదులుగా అశ్విన్.. "ఇ‍ప్పటివరకు నాకు అన్నీ నువ్వే. నేను ఇంకా నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నా అన్నయ్యా. నిన్ను అడగాలంటే కన్నీళ్లు ఆగడం లేదంటూ'  అంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు. తమ్ముడిని చూసి ఓంకార్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో అశ్విన్ హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి మరి.