మృతిని దాచిపెట్టి డబ్బులు డిమాండ్

మృతిని దాచిపెట్టి డబ్బులు డిమాండ్

కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లిలోని ఓమ్ని ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంగా మహిళ మృతి చెందిందని బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది. శ్వాస సమస్యతో మూడు రోజుల నుంచి ఈశ్వరీదేవి(55) ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటోంది. ఆమె మృతి చెందిన విషయం చెప్పకుండా ఆసుపత్రి సిబ్బంది గురువారం రూ.2 లక్షల బిల్లు కోసం ఒత్తిడి చేశారని బాధితులు ఆరోపించారు. అనుమానం వచ్చి చూడగా, అప్పటికే ఆమె మృతి చెందిందన్నారు. అయినప్పటికీ బిల్లు మొత్తం క్లియర్​ చేసి మృతదేహాన్ని తీసుకెళ్లాలని చెప్పడంతో నిరసనకు దిగారు.