
వేములవాడ, వెలుగు : జమ్ము కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇందులో భాగంగా సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయంలో విస్తృత తనిఖీలు చేపట్టారు.
ఆలయంలోకి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద మెటల్ డిటెక్టర్‌ను ఏర్పాటు చేసి ప్రతి భక్తుడి, వారి బ్యాగ్‌లను తనిఖీ చేశారు. అలాగే సీసీ కెమెరాలతో ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నామని ఎస్పీఎఫ్ సిబ్బంది తెలిపారు. ఆలయంతో పాటు పరిసరాల్లో అనుమానిత వ్యక్తులు కనబడితే వెంటనే సమాచారం ఇవ్వాలని భక్తులు, స్థానికులకు సూచించారు.