సైలెంట్ కిల్లర్: నెమ్మదిగా ప్రాణాలు తీస్తోంది జాగ్రత్త

సైలెంట్ కిల్లర్: నెమ్మదిగా ప్రాణాలు తీస్తోంది జాగ్రత్త

ఈమధ్యరోజుల్లో హడావిడీ జీవన శైలి కారణంగా ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడంలేదు. పని, సంపాదన గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు. సైలెంట్ కిల్లర్ అనే వ్యాధి ఉందని చాలా తెలియదు. మనవ శరీరంలో  హై కొలెస్ట్రాల్ ఉంటే అది ప్రాణాలకే ముప్పు. ఈ హై కొలెస్ట్రాల్ నే సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. రక్తంలో మంచి, చెడు రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో ఈ కొవ్వులు పేరుకుపోతే.. ఆకస్మిక మరణాలకు దారితీస్తుంది. LDL(చెడు కొలెస్ట్రాల్), అధిక ట్రైగ్లిజరైడ్స్ మరియు తక్కువ HDLకొలెస్ట్రాల్ (మంచి కొలెస్ట్రాల్) అనే మూడు రకాల కొవ్వులు బాడీలో ఉంటాయి.

డైస్లిపిడెమియా అనేది రక్తంలో అధిక కొలెస్ట్రాల్ లేదా ట్రైగ్లిజరైడ్స్ వంటి అసాధారణ స్థాయి లిపిడ్‌లు (కొవ్వులు) ఉన్న వైద్య పరిస్థితి. ఈ అసమతుల్యత గుండె జబ్బులు, స్ట్రోక్ మరియు ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే ఈ హై కొలెస్ట్రాల్ ని సాధారణంగా గుర్తించలేము.  లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేస్తేనే వ్యాధి బయటపడుతుంది. అందుకే డాక్టర్లు ఎలాంటి లక్షణాలు లేకుండా సంవత్సరానికి ఓ సారి అన్ని హెల్త్ టెస్టులు చేయించుకోమని సూచిస్తారు. ఫస్ట్ టైం ఇండియాలో లిపిడ్ గైడ్ లైన్స్ విడుదల చేశారు. దీనికనుగుణంగా ఈ సైలెంట్ కిల్లర్ నివారణకు మార్గదర్శకాలు విడుదల చేశారు.