తెలంగాణలో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ టెన్షన్

తెలంగాణలో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్  టెన్షన్

మహబూబ్​నగర్, వెలుగు : కాంగ్రెస్​ పార్టీ లీడర్లు హైరానా పడుతున్నారు. ఆ పార్టీ హైకమాండ్​ ఆదివారం ఫస్ట్​ లిస్ట్​ రిలీజ్​ చేయనుండడంతో , అందులో తమ పేరు ఉంటుందా? లేదా? అని టెన్షన్​ పడుతున్నారు. దీంతో నిన్నటి వరకు ఢిల్లీలో మకాం వేసిన లీడర్లంతా శనివారం హైదరాబాద్​కు చేరుకున్నారు. ఫస్ట్​ లిస్ట్​లో తమ పేరు ఉండేలా చూడాలని గాడ్​ పాదర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

ఫస్ట్​ లిస్టులో ఐదు నియోజకవర్గాలు?

ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకు గాను కొడంగల్, కొల్లాపూర్, అలంపూర్, అచ్చంపేట స్థానాల్లో ఇప్పటికే క్యాండిడేట్లను ఫైనల్​ చేసినట్లు తెలిసింది. ఈ సెగ్మెంట్ల నుంచి ఆ పార్టీ పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్ఏ సంపత్​కుమార్, చిక్కుడు వంశీకృష్ణ లేదా ఆయన భార్య చిక్కుడు అనురాధకు టికెట్​ కన్ఫాం అయినట్లు తెలుస్తోంది.

జడ్చర్లలో జనంపల్లి అనిరుధ్​రెడ్డి, ఎర్రశేఖర్​ మధ్య టికెట్​ కోసం పోటీ ఉండగా, హైకమాండ్​ సయోధ్య కుదర్చడంతో ఈ సెగ్మెంట్​ నుంచి అనిరుధ్​రెడ్డి బరిలో ఉంటారనే టాక్​  వినిపిస్తోంది. మిగతా నియోజకవర్గాల్లో ఇద్దరు, ముగ్గురు చొప్పున టికెట్ల కోసం పోటీ పడుతుండడంతో టికెట్లు ఫైనల్​ చేయడంలో ఆలస్యమవుతోంది. 

మిగిలిన సెగ్మెంట్లలో పోటాపోటీ..

నాగర్​కర్నూల్, వనపర్తి, కల్వకుర్తి, గద్వాల, మక్తల్, నారాయణపేట, మహబూబ్​నగర్, దేవరకద్ర సెగ్మెంట్లలో టికెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉంది. ఈ సెగ్మెంట్లలో కొత్త వారికి కాకుండా పార్టీని నమ్ముకొని పని చేస్తున్న వారికే టికెట్లు ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు. గద్వాల టికెట్​ను బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నుంచి కాంగ్రెస్​లో చేరిన సరితకు ఇవ్వొద్దని ఆ పార్టీ  రాష్ట్ర కార్యదర్శి కుర్వ విజయ్‌‌‌‌కుమార్  ఢిల్లీలో ఇటీవల ప్లకార్డులు ప్రదర్శించారు. కొల్లాపూర్‌‌‌‌ టికెట్‌‌‌‌ను ఉస్మానియా విద్యార్థి కోటాతో పాటు బీసీ కేటగిరిలో తనకు కేటాయించాలని ఏఐసీసీ ఓబీసీ సెల్‌‌‌‌ జాతీయ కో ఆర్డినేటర్‌‌‌‌ కేతూరి వెంకటేశ్​ ఢిల్లీలో తన గళాన్ని వినిపించారు. నాగర్​కర్నూల్​ నుంచి నాగం జనార్దన్​రెడ్డికే టికెట్​ ఇవ్వాలని రెండు రోజుల కింద ఆయన వర్గీయులు గాంధీభవన్​ ఎదుట నిరసన తెలిపారు.

వనపర్తిలో మాజీ మంత్రి చిన్నారెడ్డి టికెట్  కోసం ప్రయత్నం చేస్తుండగా, యూత్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు శివసేనారెడ్డి టికెట్ తనకే ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు. ఆయనతో పాటు ఇటీవల బీఆర్ఎస్​ నుంచి హస్తం గూటికి చేరిన పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి తనకు చాన్స్​ ఇవ్వాలని కోరుతున్నాడు. మహబూబ్​నగర్​ నుంచి ఎన్పీ వెంకటేశ్, సంజీవ్​ ముదిరాజ్, ఒబేదుల్లా కొత్వాల్  టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, హైకమాండ్​ ఇటీవల పార్టీలో చేరిన పాలమూరు మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డి పేరును పరిశీలిస్తోందనే చర్చ నడుస్తోంది.

ఇప్పటికే ఆయన ప్రచారాన్ని కూడా మొదలు పెట్టగా, ఆదివారం ప్రకటించే ఫస్ట్​ లిస్ట్​లో పేరు ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కల్వకుర్తి నుంచి ఎన్ఆర్ఐ రాఘవేందర్​రెడ్డితో పాటు ఇటీవల పార్టీలో చేరిన కసిరెడ్డి నారాయణరెడ్డి టికెట్​ ఆశిస్తున్నారు. కానీ, వీరిలో ఎవరిని ఫైనల్​ చేస్తారనేది సస్పెన్స్​లో పెట్టారు. దేవకరద్ర నుంచి పాలమూరు డీసీసీ అధ్యక్షుడు జి.మధుసూదన్​రెడ్డి (జీఎంఆర్​)తో పాటు కాటం ప్రదీప్​కుమార్​ గౌడ్​ టికెట్​ను ఆశిస్తున్నారు. మక్తల్​ సెగ్మెంట్​ నుంచి ఆ పార్టీ నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు వాటికి శ్రీహరి

దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతమ్మతో పాటు దివంగత మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి మనువరాలు చిట్టెం పర్ణికారెడ్డి పేర్లను హైకమాండ్​ పరిశీలిస్తోంది. ఈ ముగ్గురి మధ్య రాజీ కుదిరితే సీతమ్మను దేవరకద్ర నుంచి పోటీకి దింపి, పర్ణికారెడ్డిని మక్తల్​ నుంచి బరిలో దింపే ప్లాన్​ చేస్తోంది. నారాయణపేట నుంచి ఎర్ర శేఖర్​ను పోటీకి దింపేందుకు హైకమాండ్​ ఇప్పటికే సిద్ధం కాగా, ఆ పార్టీ నుంచి కుంభం శివకమార్​రెడ్డి కూడా టికెట్​ కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

బీసీ ఈక్వేషన్​ నేపథ్యంలో..

బీసీ టికెట్ల కేటాయింపుపై కూడా స్తబ్తత నెలకొంది. పాలమూరు, మక్తల్, నారాయణపేట, దేవరకద్ర, గద్వాల, షాద్​నగర్​ నియోజకవర్గాల్లో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండగా, ఈ అసెంబ్లీ సెగ్మెంట్లలో బీసీలకు టికెట్లు కేటాయించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కానీ, రాష్ట్ర పార్టీ మాత్రం నాలుగు సెగ్మెంట్లలో బీసీ లీడర్లను ఎన్నికల బరిలో నిలిపే ఆలోచన చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.