పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చు

పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చు

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌ఎస్‌‌ నుంచి గెలిచి పార్టీ మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావులపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌‌కు ఉత్తర్వులు ఇవ్వాలంటూ బీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌‌ రెడ్డి, కేపీ.వివేకానంద, బీజేపీ పక్ష నేత మహేశ్వర్‌‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు మంగళవారం విచారించింది.   

ALSO READ : ఫ్యాక్టరీలో గోల్ మాల్: తీసుకోని లోన్కు రుణమాఫీ మెసేజ్లు.. షాకైన రైతులు

ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌‌ జనరల్‌‌ ఎ.సుదర్శన్‌‌రెడ్డి వాదిస్తూ..స్పీకర్‌‌కు కోర్టులు ఆదేశాలు జారీ చేయడానికి వీల్లేదని తెలిపారు. పిటిషనర్ల తరఫు సీనియర్‌‌ అడ్వకేట్లు గండ్ర మోహన్‌‌రావు, జె.రామచందర్‌‌రావు వాదిస్తూ..స్పీకర్‌‌ కార్యాలయ కార్యదర్శికి ఉత్తర్వులు ఇచ్చి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు ఆదేశాలు ఇవ్వొచ్చునని కోర్టుకు వివరించారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని ప్రభుత్వంతోపాటు బీఆర్‌‌ఎస్‌‌ నేతలకు సూచించింది. విచారణను 25వ తేదీకి వాయిదా వేసింది.