లాయ‌ర్ కారును వెంటాడి ఢీకొట్టిన లారీ.. 500 మీటర్ల దూరం వ‌ర‌కు లాక్కెళ్లింది

జనగామ జిల్లా : హైకోర్టు అడ్వకేట్ దుర్గాప్రసాద్ కారును ఓ లారీ ఢీ కొట్టింది. దుర్గాప్ర‌సాద్ హైదరాబాద్ నుంచి హన్మకొండకు వస్తుండగా జనగాం జిల్లా యశ్వంతపూర్ వద్ద ప్ర‌మాదం జ‌రి‌గింది. హైద్రాబాద్ నుంచి వ‌స్తున్న కారును వెంబడించి జనగామ హైవేలో యశ్వంతపూర్ వద్ద లారీ ఢీ కొట్టింది. కారును 500 మీటర్ల దూరం కారును లాక్కెళ్లింది. స్థానికులు డ్రైవర్ ను పట్టుకుని ఈ ప్ర‌మాదంపై నిలదీయగా.. బ్రేక్ ఫేయిల్ అయినట్టు పొంత‌న లేని సమాధానం ఇచ్చారు. ఈ ప్ర‌మాదంపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

ఇటీవ‌లే రాష్ట్రంలో ఓ హైకోర్టు లాయ‌ర్ దంప‌తుల హ‌త్య కల‌క‌లం రేపుతుండ‌గా.. మ‌రో హైకోర్టు లాయ‌ర్ కారును వెంబ‌డించి మ‌రీ లారీ ఢీకొట్ట‌డం ప‌లు అనుమానాలు రేకెత్తుతున్నాయి. దుర్గాప్ర‌సాద్ ను ఎవ‌రైనా హ‌త్య చేయాల‌నే ఈ ప్లాన్ వేశారేమో అని ప్ర‌మాదం జ‌రిగిన చోట స్థానికులు అంటున్నారు.