
కంచ గచ్చిబౌలి భూములపై విచారణకు హైకోర్టు అంగీకరించింది. వాటా ఫౌండేషన్ వేసిన ఈ పిటిషన్ ఇవాళ (ఏప్రిల్ 1) విచారణలోకి వచ్చింది. మొదట ఈ పిటిషన్ పై విచారణను ఏప్రిల్ 7 కు వాయిదా వేసింది ధర్మాసనం. అయితే తాజా పరిణామాలతో అత్యవసర పిల్ గా స్వీకరించాలని లాయర్ కోరడంతో రేపు (ఏప్రిల్ 2) విచారిస్తామని హైకోర్టు తెలిపింది.
గచ్చిబౌలి భూముల వ్యవహారంపై 10 రోజుల క్రితమే హైకోర్టులో పిల్ దాఖలు చేసింది వాటా ఫౌండేషన్. ఈ పిటిషన్ ఇవాళ (మంగళవారం) ధర్మాసనం ముందుకు వచ్చింది. విచారణను ఏప్రిల్ 7 కు వాయిదా వేయడంతో ప్రత్యేక పిటిషన్ గా స్వీకరించాలని లాయర్ కోరడంతో అందుకు హైకోర్రటు అంగీకరించింది.