కుమ్మరివాడి అక్రమ నిర్మాణాలపై నివేదిక ఇవ్వండి

  • జీహెచ్‌‌‌‌ఎంసీకి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: అసిఫ్‌‌‌‌నగర్‌‌‌‌ లోని కుమ్మరివాడి ప్రాంతంలోఉన్న అక్రమ నిర్మాణాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని జీహెచ్‌‌‌‌ఎంసీ కమిషనర్‌‌‌‌ను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ అవి అక్రమ నిర్మాణాలని తేలితే చర్యలు తీసుకుని, అమలు నివేదికను హైకోర్టు జ్యుడీషియల్ రిజిస్ట్రార్‌‌‌‌కు సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. వారసత్వంగా వచ్చిన 426 చదరపు గజాల స్థలంలో చేసిన నిర్మాణాలకు జీహెచ్‌‌‌‌ఎంసీ నోటీసులు  ఇవ్వడాన్ని సవాలు చేస్తూ మహ్మద్‌‌‌‌ అబ్దుల్‌‌‌‌ ముబీన్‌‌‌‌తోపాటు మరొకరు హైకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. దీనిపై శనివారం జస్టిస్‌‌‌‌ కె.లక్ష్మణ్‌‌‌‌ విచారణ చేపట్టారు.  ఈ వ్యవహారంపై 4 వారాల్లో విచారణ చేపట్టి అక్రమ నిర్మాణాలపై చర్య తీసుకుని నివేదిక సమర్పించాలని జీహెచ్‌‌‌‌ఎంసీ కమిషనర్‌‌‌‌కు ఆదేశాలు జారీ చేశారు.