కౌశిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎప్పుడిస్తారో వివరణ ఇవ్వండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం

కౌశిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎప్పుడిస్తారో వివరణ ఇవ్వండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: కేసు విచారణ పేరుతో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తిరిగివ్వడంపై వివరణ ఇవ్వాలని పోలీసులకు మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 6న తన వద్ద మాసబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులు తీసుకున్న ఐ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తిరిగి ఇప్పించేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ కౌశిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి మంగళవారం అత్యవసరంగా లంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బి.విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి విచారణ చేపట్టారు. 

పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాదిస్తూ, మాసబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓ సీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.పరశురాం తన ఐ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారన్నారు. ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకున్నట్లు రసీదు కూడా ఇవ్వలేదని, బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసుతో కూడా ఆ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధం లేదని, ఈ కేసులోని రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిపోర్టులో ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి లేకపోవడమే అందుకు నిదర్శనమని చెప్పారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపాల్సి ఉందని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తిరిగిచ్చే అంశంపై వివరణ ఇవ్వాలని లేని పక్షంలో తామే తగిన ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేశారు.