కష్టాలకోర్చి పెంచిన మా అమ్మే మాకు హీరో .. మహిళా దినోత్సవ వేడుకలో హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్

కష్టాలకోర్చి పెంచిన మా అమ్మే మాకు హీరో .. మహిళా దినోత్సవ వేడుకలో హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్

హైదరాబాద్, వెలుగు: నాకు 15 నెలల వయసులో తండ్రి మరణిస్తే.. టీచర్ జాబ్ చేస్తూ కష్టాలకోర్చి మమ్మల్ని పెంచిన మా అమ్మే మాకు హీరో" అని  హైకోర్టు యాక్టింగ్‌‌‌‌‌‌‌‌ చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ తన తల్లిని ఉద్దేశించి పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన హైకోర్టు బార్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ హాలులో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. జిల్లా కోర్టుల్లో మహిళా జడ్జీల సంఖ్య పెరుగుతుండటం స్వాగతించదగ్గ పరిణామమని తెలిపారు. 

మహిళలకు రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌ల ద్వారా అవకాశం కల్పించడం హర్షణీయమని జస్టిస్‌‌‌‌‌‌‌‌ మౌసమీ భట్టాచార్య అన్నారు. హైకోర్టులో 33 శాతం మహిళా న్యాయమూర్తులున్నారని, జిల్లా కోర్టుల్లో 52 శాతం మహిళా జడ్జీలున్నారని  జస్టిస్‌‌‌‌‌‌‌‌ జి.రాధారాణి  వివరించారు. కార్యక్రమంలో రవీందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, దీప్తి తదితరులు పాల్గొన్నారు.