![ఆర్బిట్రేషన్‌తో కేసుల భారం తగ్గుతది: హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్](https://static.v6velugu.com/uploads/2025/02/high-court-chief-justice-sujay-paul-said-that-with-arbitration-the-burden-of-cases-will-be-reduced_jhN8DYZ7kd.jpg)
హైదరాబాద్, వెలుగు: కోర్టులపై పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడంలో ఆర్బిట్రేషన్ కీలక పాత్ర పోషిస్తుందని హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ అన్నారు. భవిష్యత్తు అంతా ఆర్బిట్రేషన్ దే అని చెప్పారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని కమ్యూనిటీ మీడియేటర్లకు సూచించారు.
హైదరాబాద్ లోని రాజ్‌భవన్ కమ్యూనిటీ హాల్‌లో మూడ్రోజుల పాటు నిర్వహించనున్న వలంటీర్ల శిక్షణా కార్యక్రమాన్ని జస్టిస్ సుజయ్ పాల్ ఆదివారం ప్రారంభించారు. దీన్ని వినియోగించుకోవాలని వలంటీర్లకు పిలుపునిచ్చారు. వలంటీర్లకు మూడ్రోజుల పాటు శిక్షణ ఇస్తామని తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి సీహెచ్ పంచాక్షరి తెలిపారు. వీరంతా ఆయా ప్రాంతాల్లో కమ్యూనిటీ సెంటర్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తామని చెప్పారు.