నామానాగేశ్వర్ రావుకు షాక్.. ఈడీ చార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకున్న హైకోర్ట్

నామానాగేశ్వర్ రావుకు షాక్.. ఈడీ చార్జ్ షీట్ను  పరిగణలోకి తీసుకున్న హైకోర్ట్

మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ ప్రాజెక్ట్స్ పై ఈడీ  చార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకుంది తెలంగాణ హైకోర్టు.  రాంచి ఎక్స్ ప్రెస్  లిమిటెడ్, మధుకాన్ ప్రాజెక్ట్స్ పై గతంలో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది.  రాంచి -జంషడ్ పూర్ మధ్య 4 లైన్ హైవే నిర్మాణానికి  రూ. 1030 కోట్లు లోన్  తీసుకుని నిధులను షెల్ కంపెనీలకు దారి మళ్లించారని ఈడీ అభియోగాలు  నమోదు చేసింది.   

పూర్తి లోన్ వచ్చినప్పటికీ   మధుకాన్ కంపెనీ  నిర్మాణం పూర్తి చేయలేదని తెలిపింది  ఈడీ. రూ. 365  కోట్ల రూపాయలు మనీలాండరింగ్ ద్వారా మళ్లించినట్లు గుర్తించింది ఈడీ.  గతంలో మధుకాన్ కంపెనీలపై సోదాలు నిర్వహించిన ఈడీ.. 34 లక్షల నగదుతో పాటు 105  ప్రాపర్టీస్  ను అటాచ్ చేసింది.. మధుకాన్ కంపెనీకి చెందిన 96.21 కోట్లు సీజ్ చేసిన ఈడీ