మణికొండలో చెట్ల కొట్టివేతపై ..కౌంటర్ వేయండి : హై కోర్టు 

మణికొండలో చెట్ల కొట్టివేతపై ..కౌంటర్ వేయండి : హై కోర్టు 

హైదరాబాద్, వెలుగు :   సిటీలోని మణికొండలో క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అడ్డుగా ఉన్నాయని చెప్పి 40 చెట్లను కొట్టివేయడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.  చెట్ల నరికివేతపై పూర్తి వివరాలతో కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేయాలని ప్రతివాదులైన అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి, అటవీ శాఖ ముఖ్య సంరక్షణాధికారి, బల్దియా కమిషనర్, మణికొండ మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్, పురపాలక శాఖ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఫల్గుణ కుమార్, మణికొండ మాజీ సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కె.నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డిలకు నోటీసులు ఇచ్చింది.

ఎలాంటి అనుమతులు లేకుండానే చెట్లను నరికివేశారని పేర్కొంటూ వాటా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పి. ఉదయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కృష్ణ హై కోర్టులో పిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు. దీనిపై చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరాధే, జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జె. అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్  డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుధవారం విచారించింది.  జేఎన్టీయూ– కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మధ్య ఫ్లై ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్టేందుకు 2017లో వంద చెట్లను కొట్టివేయాల్సివస్తే వాటిని ఉచితంగా మణికొండ శ్మశానవాటిక, క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద నాటారని, అందులో 70 చెట్లు బతికితే ఇప్పుడు చెప్పాపెట్టకుండా 40 చెట్లను అధికారులు కొట్టేశారని పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరఫు లాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాదించారు.

ముందుగా చెప్పి ఉంటే వాటిని మరో చోట నాటేందుకు ప్రయత్నించేవాళ్లమని, సంస్థ ఉచిత సేవలను తెలిసి కూడా అధికారులు విచక్షణారహితంగా వ్యవహరించారని వివరించారు. వాదనల తర్వాత ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విచారణను మార్చి 6కి వాయిదా వేసింది.