- మేడ్చల్ జిల్లాలోని 55 ఎకరాల వివాదంపై హైకోర్టు విచారణ
హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ మల్కాజిగిరి జల్లాలోని 55 ఎకరాల వివాదాస్పద భూమి ఎవరిదో విచారణ చేయాలని ఆ జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. 582, 583 సర్వే నంబర్లలో కోట్ల విలువ చేసే 55 ఎకరాల భూమి ఆక్రమణకు గురవుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ లాయర్ కె.విజయ్ కుమార్ దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు ఇటీవల విచారించింది. కలెక్టర్ విచారణ చేపట్టాలని, అది ప్రభుత్వ భూమి అని తేలితే స్వాధీనం చేసుకోవాలని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టిల బెంచ్ విచారించింది.