- జీహెచ్‌ఎంసీ, హెచ్ఎండీఏను ఆదేశించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు : సిటీలో వరదల నివారణకు ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలని జీహెచ్‌ఎంసీని, సంబంధిత అధికారులను హైకోర్టు ఆదేశించింది. డ్రైనేజీల మురుగు నీరు పొంగి ప్రవహించడంతో జరిగిన ప్రమాదాల గురించి వివరిస్తూ అందిన లెటర్‌ను హైకోర్టు పిల్‌గా స్వీకరించింది. ‘జూబ్లీహిల్స్‌లో వివేక్, కలాసిగూడ సమీపంలో మౌనిక అనే ఇద్దరు చిన్నారులు మరణించారు.
కలాసిగూడలో డ్రైనేజీ వాటర్‌ను కట్టడి చేయలేని పరిస్థితుల్లో ఎలాంటి హెచ్చరికలు లేకుండా విడుదల చేయడంతో మౌనిక మరణించింది. బోరుగుంతల్లో పడి చిన్నారులు చనిపోయారు. ఈ ఘటనలపై ఆఫీసర్లు స్పందించేలా ఉత్తర్వులివ్వాలి’ అని లేఖలో పేర్కొన్నారు. దీనిని విచారించిన చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్‌ల డివిజన్ బెంచ్.. 2 వారాల్లో వివరాలు అందజేయాలని సీఎస్, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, మున్సిపల్ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.