హైదరాబాద్, వెలుగు: రక్షణ శాఖ భూముల్ని కేంద్రం ఇస్తేనే రాష్ట్రం తీసుకోవాలని, అప్పటి వరకు వాటి జోలికి వెళ్లొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది. సికింద్రాబాద్‌లో బైసన్‌పోలో గ్రౌండ్ 33 ఎకరాలు, జింఖానా గ్రౌండ్ 22 ఎకరాల్లో సెక్రటేరియట్, అసెంబ్లీ, కళాభవన్లను నిర్మించాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలను సవాల్ చేస్తూ రిటైర్డ్ డీజీపీ ఎంవీ భాస్కర్‌రావు తదితరులు 2017లో వేసిన పిల్స్‌ను హైకోర్టు గురువారం విచారించింది. గవర్నమెంట్ ప్లీడర్ రాథీవ్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇప్పుడున్న సెక్రటేరియట్ ఏరియాలోనే ప్రభుత్వం కొత్త బిల్డింగ్స్ కడుతోందని, కళాభవన్, అసెంబ్లీ ప్రతిపాదనలు ఇప్పుడు అమల్లో లేవన్నారు. దీంతో పిల్‌పై విచారణ అవసరం లేదని చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిల బెంచ్ నిర్ణయించింది. పిల్‌పై విచారణను మూసేస్తున్నట్లు వెల్లడించింది. అనుమతి లేకుండా డిఫెన్స్ భూములు తీసుకోరాదని ప్రభుత్వానికి సూచించింది. అన్ని నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని, హైకోర్టుకు మాత్రం ఇవ్వడం లేదని నవ్వుతూ వ్యాఖ్య చేసింది. కొత్త జడ్జిలు వస్తున్నారని, ఇప్పుడున్న భవనం చాలడం లేదని పేర్కొంది. హైకోర్టు బిల్డింగ్ చారిత్రకమైనదని, ఇందులో నిర్మాణాలు చేయడానికి లేదని వీలు ఉండదని రాథీవ్రెడ్డి జవాబు చెప్పారు. వంద ఎకరాలు కేటాయిస్తే తీసుకోడానికి హైకోర్టు సుముఖత చూపలేదన్నారు. డిఫెన్స్ ల్యాండ్స్ ఇచ్చేందుకు కేంద్రం ఒప్పుకుందన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు, సమ్మతి వేరని, ల్యాండ్స్ అప్పగించడం వేరని, భూములు అప్పగించే వరకు వాటి జోలికి వెళ్లకూడదని ఆదేశిస్తూ పిల్‌పై విచారణ ముగించింది.
రక్షణశాఖ భూముల్నికేంద్రం ఇస్తేనే రాష్ట్రం తీసుకోవాలి
- తెలంగాణం
- February 18, 2022
మరిన్ని వార్తలు
-
బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలి.. సీఎం రేవంత్ ఉగ్రరూపం
-
బీఆర్ఎస్ పదేళ్లలో చేయలేని రుణమాఫీ.. ఒక్క ఏడాదిలోనే చేసి చూపించాం: సీఎం రేవంత్ రెడ్డి
-
దొంగ పాసు పుస్తకాలు తయారు చేసి వేల కోట్లు కొల్లగొట్టారు: రైతు బంధుపై సీఎం రేవంత్ రెడ్డి
-
అసెంబ్లీ నుండి కిమ్స్ హాస్పిటల్ బయలుదేరిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి...
లేటెస్ట్
- బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలి.. సీఎం రేవంత్ ఉగ్రరూపం
- Gold Rates: గోల్డ్ ప్రియులకు షాక్.. వరుసగా మూడు రోజులు తగ్గి.. ఒక్కసారిగా పెరగిన బంగారం ధరలు
- బీఆర్ఎస్ పదేళ్లలో చేయలేని రుణమాఫీ.. ఒక్క ఏడాదిలోనే చేసి చూపించాం: సీఎం రేవంత్ రెడ్డి
- IND vs PAK: బోర్డర్లో స్టేడియం కట్టండి.. ఛాంపియన్స్ ట్రోఫీపై షెహజాద్ వింత సలహా
- దొంగ పాసు పుస్తకాలు తయారు చేసి వేల కోట్లు కొల్లగొట్టారు: రైతు బంధుపై సీఎం రేవంత్ రెడ్డి
- అసెంబ్లీ నుండి కిమ్స్ హాస్పిటల్ బయలుదేరిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి...
- Bihar Power Plant: థర్మల్ పవర్‌ప్లాంట్..అదానీ గ్రూప్ 20వేల కోట్ల పెట్టుబడులు
- IND vs AUS: కళ తప్పిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. ఇద్దరు ఆటగాళ్లదే ఆధిపత్యం
- కువైట్ చేరుకున్న ప్రధాని మోదీ.. ఘనంగా స్వాగతం పలికిన కువైట్ ఎమిర్
- Barack Obama: అమెరికా మాజీ ప్రెసిడెంట్ ఫెవరెట్ సినిమాల లిస్ట్ లో మలయాళ సినిమా.. గ్రేట్..
Most Read News
- మీ కోసమే : జనవరి 20లోపు.. ఈ కార్డులకు కచ్చితంగా KYC అప్ డేట్ చేసుకోండి.. లేకపోతే పని చేయవు..
- UI Box Office Collection Day 1: డీసెంట్ కలెక్షన్లు రాబట్టిన ఉపేంద్ర యూఐ.. హిట్ పడినట్లే..
- HYD : మాదాపూర్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
- Good Health: బ్రౌన్ రైస్ తినడం అలవాటు చేసుకోండి.. జీవితంలో హాస్పిటల్ వైపు కూడా చూడరు..
- వైన్స్‌లో వేటకొడవళ్లతో బీభత్సం
- 8 ఏళ్ల తర్వాత.. 8 రూపాయల బస్ ఛార్జీ పెంచిన రాష్ట్రం
- ఖమ్మంలో రెండు కొత్త మున్సిపాలిటీలు!
- Christmas 2024 : మెదక్ కంటే పెద్ద చర్చి.. మన తెలంగాణలోనే మరొకటి ఉంది తెలుసా..!
- Rain alert: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఎప్పటి నుంచి అంటే..
- ప్రపంచాన్ని వణికిస్తున్న డింగా డింగా వైరస్.. ఎవరెవరికి వస్తుంది.. ఎలా వ్యాపిస్తుంది.. దీని లక్షణాలు ఏంటీ..?