సీఎం రేవంత్పై నమోదైన జన్వాడ డ్రోన్ కేసు కొట్టివేసిన హైకోర్ట్

సీఎం రేవంత్పై నమోదైన జన్వాడ డ్రోన్ కేసు కొట్టివేసిన హైకోర్ట్

సీఎం రేవంత్‌ రెడ్డిపై నమోదైన జన్వాడ డ్రోన్ కేసును కొట్టివేసింది తెలంగాణ హైకోర్టు. కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ ను  డ్రోన్ తో చిత్రీకరించారంటూ  రేవంత్ రెడ్డితో పాటు మరికొంత మందిపై  నార్సింగి పీఎస్‌లో 2020 మార్చిలోకేసు నమోదయ్యింది.    2020 మార్చిలోనే రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు నార్సింగి పోలీసులు. 

Also Read :- ఎన్నో ఏళ్ల చిక్కుముడికి పరిష్కారం చూపించాం

2020 మార్చిలో ఎఫ్‌ఐఆర్ క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు  రేవంత్ రెడ్డి. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని 2025 మార్చి 11న  ప్రభుత్వాన్ని ఆదేశించి హైకోర్టు.   ఇవాళ హైకోర్టులో విచారణ సందర్భంగా .. జన్వాడ నిషిద్ధ ప్రాంతమేమి కాదని  రేవంత్ రెడ్డి తరఫును న్వాయయవాది వాదించారు.  రేవంత్ రెడ్డిపై తప్పుడు సెక్షన్లు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు.  డ్రోన్ ఎగురవేసిన ప్రాంతం నిషిద్ధ జాబితాలో లేదని చెప్పారు. రెండు వర్గాల తరపున వాదనలు విన్న హైకోర్టు నార్సింగి పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.