విద్యానిధి సాయం అందించాల్సిందే

  • ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: అంబేద్కర్‌‌ ఓవర్సీస్‌‌ విద్యానిధి (ఏవోవీఎన్‌‌) కింద కరీంనగర్‌‌కు చెందిన స్టూడెం ట్​కు ఆర్థిక సాయం అందించాలన్న సింగిల్‌‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై ప్రభు త్వం దాఖలు చేసిన అప్పీలును హైకోర్టు కొట్టేసింది. సింగిల్‌‌ జడ్జి ఫిబ్రవరిలో తీర్పు వెలువరించగా 161 రోజుల తర్వాత ప్రభుత్వం అప్పీ లు దాఖలు చేసిందని, ఇంత జాప్యా నికి సరైన కారణం చెప్పకపోవడం తో అప్పీలును అనుమతించలేమని తెలిపింది.

ఆదాయం రూ.2 లక్షలు దాటిందన్న కారణంగా ఓవర్సీస్‌‌ విద్యానిధి పథకం కింద తన కుమా రుడి దరఖాస్తును తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ కరీంగనగర్‌‌కు చెంది న జి.వెంకట నరహరి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన సింగిల్‌‌ జడ్జి.. పెన్షన్‌‌ సొమ్ము రూ.2 లక్షలు వస్తుందని, అందులో మెడికల్‌‌ బిల్లులు, ఇంటి రుణం పోను రూ.1.70 లక్షలు ఉంటుందని, అం దువల్ల సాయం అందించాలని ఉత్త ర్వులు వెలువరించారు. దీన్ని సవాల్ చేస్తూ సాంఘిక సంక్షేమ శాఖ దాఖ లు చేసిన అప్పీలుపై చీఫ్​ జస్టిస్‌‌ అలో క్‌‌ అరాధే, జస్టిస్‌‌ జె.శ్రీనివాస రావుతో కూడిన బెంచ్​ మంగళవారం విచా రణ చేపట్టింది.

ఫిబ్రవరిలో తీర్పు వెలువరించగా అప్పీలు దాఖలు చేయడానికి 161 రోజుల జాప్యం జరిగిందని, దీనికి సరైన కారణాలు చెప్పకుండా అనుమతించలే మని కొట్టేసింది. దీంతో ప్రభుత్వం సింగిల్‌‌ జడ్జి తీర్పు ప్రకారం సాయం అందించాల్సి ఉంది.