హైదరాబాద్, వెలుగు : రచయిత, ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై దాఖలైన పలు కేసులను కొట్టివేస్తూ హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అనే పుస్తక రచనపై ఏర్పడిన వివాదంలో ఐలయ్యపై పలు కేసులు నమోదయ్యాయి. వైశ్యుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ మల్కాజిగిరికి చెందిన శ్రీకాంత్‌గుప్తా ఫిర్యాదుతో కేసు నమోదైంది. అలాగే వివిధ చోట్ల ఫిర్యాదులు అందడంతో పలు కేసులు నమోదయ్యాయి.
ఈ కేసులను కొట్టివేయాలంటూ ఐలయ్య హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ రాధారాణి విచారణ చేపట్టి ఐలయ్యపై ఉన్న కేసులను కొట్టివేశారు. పుస్తకాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసిన విషయాన్ని న్యాయమూర్తి ప్రస్తావిస్తూ భావప్రకటనా స్వేచ్ఛ అందరికీ ఉంటుందని స్పష్టం చేశారు.