బంగారం కస్టమ్స్‌‌ స్వాధీనం సబబే: హైకోర్టు

బంగారం కస్టమ్స్‌‌ స్వాధీనం సబబే: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: కస్టమ్‌‌ అధికారులు తమ నుంచి గత ఏడాది ఆగస్టు 12న రెండు కిలోల ఎనిమిది వందల గ్రాముల బంగారాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారంటూ షేక్‌‌ అరిఫ్, షేక్‌‌ మహమ్మద్‌‌ సిద్ధికి వేసిన వ్యాజ్యాలను హైకోర్టు డిస్మిస్‌‌ చేసింది. చట్ట విరుద్ధంగా స్వాధీనం చేసుకున్న బంగారాన్ని తమకు అప్పగించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్లను జస్టిస్‌‌ సామ్‌‌ కోషి, జస్టిస్‌‌ తుకారాంజీ డివిజన్‌‌ బెంచ్‌‌ ఇటీవల కొట్టివేసింది.

పిటిషనర్లు బ్యాంకాక్‌‌లో లీగల్‌‌గా బంగారాన్ని కొనుగోలు చేశారని, మన దేశానికి వచ్చాక కస్టమ్స్‌‌ అధికారులకు తెలియజేసేందుకు వెళుతుంటే డిక్లరేషన్‌‌ కౌంటర్‌‌ వద్ద అధికారులు అడ్డుకున్నారని న్యాయవాది చెప్పారు. ఈ వాదనను కస్టమ్స్‌‌ అధికారుల(సీబీడీటీ) న్యాయవాది వ్యతిరేకించారు. డ్యూటీ చెల్లించాలన్న ఉద్దేశం ఉంటే బంగారానికి నల్లని టేపు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. దేశంలో బంగారం స్మగ్లింగ్‌‌ చేస్తారనే ఆరోపణలు కూడా పిటిషనర్లపై ఉన్నాయన్నారు. కస్టమ్స్‌‌ డ్యూటీ చెల్లించడానికి నగదు కూడా వాళ్ల దగ్గర లేదన్నారు. ఈ వాదనను హైకోర్టు ఆమోదించి పిటిషన్లను డిస్మిస్‌‌ చేసింది.