హిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులో రాహిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టివేత

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లోని ప్రజా భవన్ వద్ద జరిగిన హిట్అండ్ రన్ కేసును కొట్టేయాలంటూ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు మహమ్మద్ రాహిల్ అమీర్ దాఖలు చేసిన పిటిషన్ ను బుధవారం హైకోర్టు కొట్టివేసింది. పోలీసుల ముందు గుర్తింపు పరేడ్ కు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. రోడ్డు ప్రమాదం కేసులో తనను అక్రమంగా ఇరికించారని, కేసును కొట్టివేయాలని కోరుతూ రాహిల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన  జస్టిస్ కె.లక్ష్మణ్ పిటిషన్ కొట్టివేతకు నిరాకరించారు. ఈ నెల16న జరిగే నిందితుడి గుర్తింపు ప్రక్రియకు హాజరుకావాలని ఆదేశించారు. కేసు దర్యాప్తునకు సహకరించాలని రాహిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సూచిస్తూ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొట్టి వేశారు.