- ఫార్ములా ఈ కేసులో అరెస్టుపై స్టే ఎత్తివేత
- ఎల్లుండి విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు
- అదే రోజు అరెస్టు చేస్తారంటూ ఊహాగానాలు
- హాట్ టాపిక్ గా మారిన ఫార్ములా ఈ కేసు
హైదరాబాద్: ఫార్ములా ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టుకు లైన్ క్లియర్ అయ్యింది. ఫార్ములా ఈ వ్యవహారంలో రూ. 55 కోట్లను అక్రమంగా విదేశీ సంస్థలకు బదలాయించారని పేర్కొంటూ హెచ్ఎండీఏ కమిషనర్ దాన కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్, ఏ2గా అప్పటి హెచ్ఎండీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను, అదేవిధంగా హెచ్ఎండీఏ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ చేర్చింది.
తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని కోరుతూ మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గత నెల 31న ఇరువైపుల వాదనలు ముగించిన హైకోర్టు.. నేడు తీర్పు వెలువరించింది. ఏసీబీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు.ఫార్ములా - ఈ రేసు వ్యవహారంలో ఒప్పందం జరగకముందే చెల్లింపులు చేశారని ఆయన కోర్టుకు తెలిపారు. బ్రిటన్ పౌండ్ల రూపంలో రూ.46 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. ఈ - కార్ల రేసింగ్ సీజన్ 10 ఒప్పందానికి ముందే నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేశారన్నారు.
ALSO READ | రూట్ క్లియర్ అయ్యిందా: కేటీఆర్ అరెస్ట్ పైనా.. స్టే ఎత్తివేసిన హైకోర్టు
కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ దవే వాదనలు వినిపించారు. ఏసీబీ అధికారులు నమోదు చేసిన సెక్షన్లు కేటీఆర్‌కు వర్తించవని కోర్టుకు తెలిపారు. ఫిర్యాదు దారు దానకిశోర్ తరఫున సీనియర్ న్యాయవాది సీపీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. మున్సిపల్ మంత్రి పర్యవేక్షణలోనే ఆ శాఖ అధికారులు విధులు నిర్వహిస్తారని, రేసింగ్‌కు సంబంధించిన చెల్లింపుల ఫైల్ పై అప్పటి మంత్రి కేటీఆర్ ఆమోదిస్తూ సంతకం చేశారన్నారు. కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ దవే వాదనలు వినిపించారు. ఏసీబీ అధికారులు నమోదు చేసిన సెక్షన్లు కేటీఆర్‌కు వర్తించవని కోర్టుకు తెలిపారు. నగదు బదిలీలో కేటీఆర్ ఎక్కడా లబ్ధిపొందలేదని, అవినీతి జరిగినట్లు కూడా ఎఫ్‌ఐఆర్‌లో ఎక్కడా పేర్కొనలేదని తెలిపారు.
ALSO READ | కేటీఆర్ కేసులో బిగ్ ట్విస్ట్: సుప్రీంకోర్టులో ముందుగానే పిటిషన్ వేసిన రాష్ట్ర ప్రభుత్వం
ముగ్గురి వాదనలూ విన్న న్యాయస్థానం తాము తదుపరి తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దని సూచించి తీర్పు రిజర్వులో పెట్టింది. అదే సమయంలో విచారణకు సహకరించాలని పేర్కొంటూ కేటీఆర్ కు సూచించింది. ఈ అంశంపై ఇవాళ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఏసీబీ వాదనలో ఏకీభవిస్తూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టేసింది. కేటీఆర్ ను అరెస్టు చేయొద్దంటూ ఇచ్చిన స్టేను కూడా ఎత్తేసింది. దీంతో ఆయన అరెస్టుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ తీర్పుపై కేటీఆర్ డివిజన్ బెంచ్ కు వెళ్తారా..? సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా..? అన్న చర్చ మొదలైంది.
ఎల్లుండి ఏసీబీ విచారణ
ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ నిన్న ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఏసీబీ ఆఫీసు వరకు వెళ్లిన ఆయన తన లాయర్ ను అనుమతించకపోవడంతో అధికారులతో వాగ్వాదానికి దిగి తిరిగి వెళ్లిపోయారు. దీంతో ఏసీబీ ఈ నెల 9న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన తప్పకుండా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే విచారణకు హాజరవుతారా..? సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేస్తారా..? లేదా సుప్రీం కోర్టుకు వెళ్తారా..? అన్నచర్చ మొదలైంది. ఈ నెల 9న విచారణకు పిలిచిన ఏసీబీ అక్కడే అరెస్టు చేసే అవకాశమూ లేకపోలేదని అంటున్నారు. ఆయనపై పెట్టిన సెక్షన్ల ప్రకారం అరెస్టు కే అవకాశం ఎక్కువని న్యాయనిపుణులు చెబుతున్నారు.
ALSO READ | Formula E Car Race Case: కేటీఆర్ కు మరోసారి ఈడీ నోటీసులు