APPSC: గ్రూప్ 1పై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం...

APPSC: గ్రూప్ 1పై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం...

2018 గ్రూప్ 1ను రద్దు చేయాలంటూ ఇటీవల ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. 2018లో జరిగిన గ్రూప్ 1పరీక్షకు గాను పలు మార్లు మూల్యాంకనం జరపటంపై కొంతమంది అభ్యర్థులు వేసిన పిటీషన్ మేరకు ఏపీ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులంతా యదావిధిగా కొనసాగుతారని, తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది డివిజన్ బెంచ్.

డివిజన్ బెంచ్ తీసుకున్న తాజా నిర్ణయంతో 2018 గ్రూప్1 అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల 2018 గ్రూప్1 పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సింగిల్ బెంచ్, విధుల్లో ఉన్న ఉద్యోగులు విధులకు హాజరుకాకూడదని, ఆరు వారాల్లోగా తిరిగి పరీక్ష నిర్వహించాలని ఆదేశాలివ్వడంతో ఉద్యోగులు ఆందోళన చెందారు. తాజాగా సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధిస్తూ డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకోవటంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.