భుజంగరావు బెయిలు డిసెంబర్ 16 వరకు పొడిగింపు..ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

భుజంగరావు బెయిలు డిసెంబర్ 16 వరకు పొడిగింపు..ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులో మూడో నిందితుడైన మాజీ అదనపు ఎస్పీ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. భుజంగరావుకు ఈ నెల 16వ తేదీ వరకు మధ్యంతర బెయిలును పొడిగిస్తూ మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం మంజూరు చేసిన మధ్యంతర బెయిలును పొడిగించాలన్న భుజంగరావు అభ్యర్థనను నాంపల్లి కోర్టు గతంలో తిరస్కరించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కె.సుజన మంగళవారం విచారణ చేపట్టారు. న్యాయవాదులు గడువు కోరడంతో విచారణను16వ తేదీకి వాయిదా వేస్తూ అప్పటివరకు మధ్యంతర బెయిలును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.