పిన్నెల్లికి హైకోర్టులో ఊరట..

ఏపీలో ఎన్నికల అనంతరం చెలరేగిన ఘర్షణలు రేపిన కలకలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ ఘర్షణల్లో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో కేసు నమోదయ్యింది. ప్రస్తుతం ఈ కేసులో హైకోర్టు పిన్నెల్లికి మధ్యంతర బెయిల్ గడువు ముగియటంతో గురువారం హైకోర్టులో విచారణకు హాజరయ్యారు పిన్నెల్లి. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు పిన్నెల్లి మధ్యంతర బెయిల్ గడువు పొడిగించింది.

వచ్చే గురువారం వరకు బెయిల్ గడువు పొడిగించింది ఏపీ హైకోర్టు. అయితే, ఈ కేసులో విచారణ త్వరగా పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో పిన్నెల్లి జైలుకు వెళ్ళటం ఖాయమని అనుకున్నారు అంతా. అయితే, హైకోర్టు పిన్నెల్లి బెయిల్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయటంతో ఆయన ఊరట లభించిందని చెప్పాలి.