తప్పుదోవ పట్టించిన.. పిటిషనర్‌‌‌‌‌‌‌‌కు హైకోర్టు రూ.10 వేల జరిమానా

తప్పుదోవ పట్టించిన.. పిటిషనర్‌‌‌‌‌‌‌‌కు హైకోర్టు రూ.10 వేల జరిమానా

హైదరాబాద్, వెలుగు: మేడ్చల్‌‌‌‌‌‌‌‌ జిల్లాకు చెందిన ఓ పిటిషనర్​హైకోర్టును తప్పుదోవ పట్టించాడు. ప్రగతినగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన డి.మహేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి గాజులరామారాంలోని సర్వే నెం.329/4, 329/5లో మహదేవపురం రెసిడెన్షియల్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టు ఫేజ్‌‌‌‌‌‌‌‌-3లో 200 చదరపు గజాల ఇంటి జాగాకు సంబంధించిన డాక్యుమెంట్స్‌‌‌‌‌‌‌‌ అన్నీ ఇచ్చినా కుత్బుల్లాపూర్‌‌‌‌‌‌‌‌ సబ్‌‌‌‌‌‌‌‌రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ చేయలేదంటూ ఇటీవల హైకోర్టును ఆశ్రయించాడు.

ఈ కేసును జస్టిస్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌.వి.శ్రవణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ విచారణ చేపట్టారు. అయితే మహేశ్వర్​రెడ్డి సబ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌ను అస్సలు కలవనేలేదని, ఏవిధమైన డాక్యుమెంట్స్‌‌‌‌‌‌‌‌ సమర్పించలేదని ప్రభుత్వ సహాయ న్యాయవాది హెచ్‌‌‌‌‌‌‌‌.రాకేశ్​కుమార్‌‌‌‌‌‌‌‌ కోర్టుకు తెలిపారు. అవసరమైన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ ఛార్జీలను చలానా రూపంలో చెల్లించలేదని వివరించారు. పిటిషనర్ పై సీరియస్​అయిన హైకోర్టు  రూ. 10 వేలు జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని కోర్టు మాస్టర్స్, వ్యక్తిగత కార్యదర్శుల అసోసియేషన్‌‌‌‌‌‌‌‌కు చెల్లించాలని స్పష్టం చేసింది. డాక్యమెంట్స్‌‌‌‌‌‌‌‌ సమర్పించి రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ చేసుకోవచ్చునని చెప్పింది.