హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ కొండాపూర్ సర్వే నెం.87లో ని 5.04 ఎకరాలకు సంబంధించిన భూవివాదంలో జోక్యం చేసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కొండాపూర్‌లో తమ స్థలాన్ని ఖాళీ చేయించడానికి వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి దంపతులకు పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ షేక్ ఇస్లాముద్దీన్ మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని హైకోర్టు బుధవారం విచారించింది. పిటిషనర్ల అడ్వకేట్ వాదిస్తూ..2022 ఫిబ్రవరిలో పిటిషనర్ల మధ్య అవగాహన ఒప్పందం ఉందన్నారు.
వైవీ దంపతులకు ఎలాంటి హక్కులు లేవని కోర్టుకు చెప్పారు. వైవీ తరఫున అడ్వకేట్ వాదిస్తూ..ఆ భూమిని 2006లో కొనుగోలు చేశారని, 2014 నుంచి వైవీ సుబ్బారెడ్డి భార్య పేరు మీద ఉందని తెలిపారు.వాదనలను విన్న కోర్టు..సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం ఏమిటని ఫైర్ అయ్యింది.