బ్రేకింగ్: గ్రూప్-1 సెలక్షన్ పక్రియకు బ్రేక్.. నియామక పత్రాలు ఇవ్వొద్దని హైకోర్టు ఆర్డర్

బ్రేకింగ్: గ్రూప్-1 సెలక్షన్ పక్రియకు బ్రేక్.. నియామక పత్రాలు ఇవ్వొద్దని హైకోర్టు ఆర్డర్

హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు అనంతరం తొలిసారి జరిగిన గ్రూప్-1 నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. గ్రూప్-1 నియామక ప్రక్రియను ఆపాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టులో విచారణ పూర్తి అయ్యే వరకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని ఆదేశించింది. అయితే.. అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరికేషన్ మాత్రం కొనసాగించవచ్చని హైకోర్టు తెలిపింది. 

కాగా, గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు తెలంగాణ హైకోర్టులో దాదాపు 20 పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లపై గురువారం (ఏప్రిల్ 17) హైకోర్టు విచారణ చేపట్టిన హైకోర్టు.. కేసు విచారణ పూర్తి అయ్యే వరకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని టీజీపీఎస్సీని ఆదేశించింది. దీంతో గ్రూప్ 1కు ఎంపికైన అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. 

►ALSO READ | భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూ భారతి ఎంతో ఉపయోగం: మంత్రి పొంగులేటి

కాగా, గ్రూప్ 1 పరీక్షలో భారీ స్కామ్ జరిగిందని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. మరోవైపు.. గ్రూప్ 1లో ఎలాంటి అవకతవకలు జరగలేదని టీజీపీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో ఇష్యూ కోర్టుకు చేరడంతో నియామక ప్రక్రియకు హైకోర్టు బ్రేక్ వేసింది. దీంతో కోర్టు నిర్ణయంపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.