రాజధాని ఫైల్స్(Rajadhani Files) సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమా విడుదల చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకోర్టు. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలను తొలగించామని చెప్పిన సెన్సార్ బోర్డు వాదనలతో ఏకీభవించింది కోర్టు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఫైల్స్ సినిమా రిలీజ్ చేసుకునేందుకు లైన్ క్లియర్ అయ్యింది.
ఇదిలా ఉంటే.. రాజధాని ఫైల్స్ సినిమా విడుదలను ఆపేయాలంటూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై గురువారం విచారణ జరిపిన కోర్టు స్టే విధించింది. ఇవాళ(ఫిబ్రవరి 16) మరోసారి విచారణకు జరుగగా.. స్టేను ఎత్తివేస్తూ తూర్పు ఇచ్చింది ధర్మాసనం. దీంతో ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఫైల్స్ సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్.