హైదరాబాద్: ప్రముఖ ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్‌కు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. లైంగిక ఆరోపణల కేసులో మల్లిక్ తేజ్‌కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కాగా, తెలంగాణ సంస్కృతిక సారధి ఉద్యోగిగా పనిచేస్తున్న మల్లిక్ తేజ్‌పై ఓ మహిళా ఫోక్ సింగర్ ఫిర్యాదు చేసింది. మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడని జగిత్యాల పీఎస్‌లో కంప్లైంట్ చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసుల మల్లిక్ తేజ్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో జగిత్యాలలో తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసుపై మల్లిక్ తేజ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశాడు.
Also Read :- గాయత్రి మరణ వార్త విని చాలా బాధపడ్డా
ఈ పిటిషన్‌పై ఇవాళ (2024, 5 అక్టోబర్) హైకోర్టులో విచారణ జరగగా.. మల్లిక్ తేజ్ తరపున న్యాయవాది జక్కుల లక్ష్మణ్ వాదనలు వినిపించారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేశారని, సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న మల్లిక్‌పై కావాలనే అక్రమ కేసులు పెట్టారని లక్ష్మణ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనల అనంతరం ఈ కేసులో మల్లిక్ తేజ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.