హైదరాబాద్, వెలుగు: హైడ్రా ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసులో నిజాంపేట మున్సిపల్ కమిషనర్ పి.రామకృష్ణారావుకు హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కమిషనర్ రెండు వారాల్లో పోలీసుల ముందు లొంగి పోయి, రూ.20 వేలు వ్యక్తిగత బాండ్‌తో పాటు అంతే మొత్తానికి మరో రెండు పూచీకత్తులు సమర్పించాలంది.
8 వారా లపాటు ప్రతి శనివారం లేదా చార్జిషీట్ దాఖలు చేసేదాకా పోలీసు స్టేషన్లో హాజరుకావాలని స్పష్టం చేసింది. హైదరాబాద్ బాచుపల్లి ఎర్రకుంట బఫర్‌జోన్‌లో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించారంటూ హైడ్రా ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ కేసులో బెయిల్ కోసం రామకృష్ణారావు హైకోర్టులో పిటిషన్ వేయగా ఊరట లభించింది.